కాలిఫోర్నియాలో రోడ్డెక్కిన జలకన్య
గతంలో వెంకటేష్ హీరోగా, శిల్పా శెట్టి హీరోయిన్గా వచ్చిన సాహస వీరుడు సాగరకన్న సినిమా గుర్తు ఉందిగా? ఆ సినిమాలో జలకన్య పాత్ర ఉంటుంది. అచ్చు అలాంటి ఓ అమ్మాయే ఇప్పుడు బయటకు వచ్చి అంతు చిక్కని రహస్యంగా మారి అమెరికా పోలీసులకు సవాల్ విసురుతోంది. ఓ సరస్సుకు సమీపంలో రోడ్డుపై వస్తున్న ట్రక్కును ఆపిన ఓ యువతి తనను ఆసుపత్రికి తీసుకువెళ్లవలసిందిగా డ్రైవర్ను కోరింది. తన పేరు జో అన్నా అని, తాను జల కన్యనని, పక్కనే ఉన్న సరస్సులో ఉంటానని చెప్పింది. ఇక ఆమె శరీరంలోని అధిక భాగం నగ్నంగా, శరీరమంతా తడిగా ఉంది. కాళ్లు సైతం అందరిలా లేవు. వేళ్లు మధ్య చర్మం ఉంది. తన గురించిన మరిన్ని వివరాలేమీ ఆమె చెప్పడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆమె ఒక్కోసారి చాలా భయంకరంగా ప్రవర్తిస్తోందని వైద్యులు అంటున్నారు. జో అన్నా ఎవరన్నది గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక ప్రచారం కూడా మొదలు పెట్టాడు.













