నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్లో థండర్స్ టీమ్ విజేత
నాట్స్ నిర్వహించిన వాలీబాల్ నేషనల్ కప్ టోర్నీలో థండర్స్ టీమ్ విజేతగా నిలిచింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ రాజేంద్ర మాదాల చొరవతో కార్లటన్లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ డల్లాస్ మీట్ సహకారంతో స్థానిక అడ్వెంటేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నమెంటులో 24టీమ్‌లతో పాటు దాదాపు 200 మందికిపైగా వాలీబాల్ ప్లేయర్లు పాల్గొన్నారు. నాట్స్ నేషనల్ కప్, నాట్స వాలంటీర్ కప్ అనే రెండు టోర్నీలు నిర్వహించింది. మొదటి నుంచి నాట్స్ కోసం పనిచేస్తున్న వారి కోసం వాలంటీర్ కప్ పేరుతో ఈ పోటీని నిర్వహించింది. నాట్స్ నేషనల్ కప్ టోర్నీలో థండర్స టీమ్ విజేతగా నిలిచింది. రేంజర్స్ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. ఇక నాట్స్ వాలంటీర్ కప్‌ను స్పార్టన్స్ టీం సొంతం చేసుకుంది. స్నిపర్స్ టీం రన్నరప్‌గా నిలిచింది. అట్లాంటా, హ్యుస్టన్, శాన్ అన్ టానియో ఇలా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వాలీబాల్ ప్లేయర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ బోర్డు ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదల, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి బాపు నూతి, శ్రీనివాస్ కోనేరు. విజయ్ శేఖర్ అన్నే, డల్లాస్ చాప్టర్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మరినేని తదితరులు ఈ టోర్నమెంట్‌కు తమ పూర్తి సహకారాలు అందించారు. ఇక నాట్స్ జాతీయ సభ్యులు కిషోర్ వీరంగంధం, చైతన్య కంచర్ల, అమర్ అన్నే, శ్రీనివాస్ కొమ్మినేని, కృష్ణ నిమ్మగడ్డ, ఉమా అట్లూరి తదితరులు ఈ టోర్నమెంటుకు హాజరై తమ విలువైన సేవలు అందించారు. నాట్స్ విజేతలు, రన్నరప్‌లకు బహుమతులు అందచేసింది. క్రీడా స్ఫూర్తితో సుదూర ప్రాంతాల నుంచి ముందుకొచ్చిన వాలీబాల్ ప్లేయర్లను ప్రత్యేకంగా అభినందించింది. ట్యాంటెక్స ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సత్యం వీరనపు, తదితరులు ఈ టోర్నీకి హాజరై ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ టోర్నమెంటును ఘనంగా నిర్వహించింనందుకు నాట్స్ స్పోర్ట్స్ కమిటీకి అభినందనలు తెలిపారు.








