డిమెన్షియాపై ‘నాట్స్’ అవగాహన సదస్సు.. మే 2న నిపుణులతో వెబ్‌నార్!
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) సామాజిక బాధ్యతలో భాగంగా ‘Memory Matters’ అనే అంశంపై ప్రత్యేక వెబ్‌నార్‌ను నిర్వహించనుంది. ముఖ్యంగా ఆసియా భారతీయులలో కనిపిస్తున్న ‘డిమెన్షియా’ (జ్ఞాపకశక్తి కోల్పోవడం) వ్యాధికి గల కారణాలు, గుర్తింపు, చికిత్స , నివారణా మార్గాలపై ఈ కార్యక్రమంలో సమగ్రంగా చర్చించనున్నారు.
కార్యక్రమ వివరాలు..
- అంశం: మెమరీ మ్యాటర్స్ – అండర్స్టాండింగ్ డిమెన్షియా.
- తేదీ: మే 02, 2026 (శనివారం).
- సమయం: ఉదయం 11:00 గంటలకు (EST).
- ప్రధాన వక్త: అంజు వధావన్ (MSN, MHA, RN, PhD Student).
బ్నార్ ప్రధాన ఉద్దేశం..
వయసు పైబడిన వారిలో వచ్చే మతిమరుపు సమస్యలను కేవలం వృద్ధాప్య లక్షణాలుగా భావించకుండా, అది డిమెన్షియా వైపు దారితీస్తుందా అనే కోణంలో అవగాహన కల్పించడమే ఈ వెబ్‌నార్ ప్రధాన ఉద్దేశ్యం. నిపుణులైన అంజు వధావన్ గారు ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , రోగ నిర్ధారణ పద్ధతుల గురించి వివరించనున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల వారు కింద పేర్కొన్న లింక్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
లింక్: natsworld.org/mindwellness
ఈ కార్యక్రమాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి , కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం నాట్స్ హెల్ప్‌లైన్ +1-888-4-TELUGU ను సంప్రదించవచ్చు.








