నాట్స్ సంబరాలకు ఎడ్లపల్లికి ఆహ్వానం
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు ప్రకృతి వ్యవసాయశిక్షణ కేంద్రం చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు అమెరికాలో నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు అసోషియేషన్) నిర్వహిస్తున్న తెలుగు సంబరాలకు హాజరుకానున్నారు. కార్యక్రమానికి హాజరుకావాలని సంబరాలు నిర్వాహణ కమిటీ చైర్మన్ రవి ఆచంట నుంచి ఆయనకు ఆహ్వాన పత్రిక అందింది. జూన్ 30 నుంచి జూలై 2 వరకు జరిగే సదస్సులో పాల్గొని ప్రసంగించాలని ఆయన్ను కోరారు. నేడు అమెరికాకు బయలుదేరి వెళుతున్నట్లు ఎడ్లపల్లి వెల్లడించారు. భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రానున్న రోజుల్లో వ్యవసాయంలో వచ్చే మార్పులను సభలో వివరిస్తానని ఆయన తెలిపారు.








