విష్ణు పుప్పలకు అండగా నాట్స్
మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విష్ణు పుప్పల
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నేను ఉన్నానంటూ ముందుకొచ్చే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తెలుగువాడైన విష్ణు సూర్య ప్రకాశరావు పుప్పల కు ప్రాణాలు నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలోని సాన్ అంటానియోలో ఉంటున్న కూతురు, అల్లుడిని చూసేందుకు వచ్చిన విష్ణు ఒక్క రోజు ఒక్కసారిగా తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. వైద్యులు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తేల్చి ఐదు సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఇంకా డాక్టర్స్ పర్యవేక్షణ లోనే ICU లో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో నాట్స్ హెల్ఫ్ లైన్ ను ఆశ్రయించారు. నాట్స్ హెల్ప్ లైన్ టీం నించి బోర్డు అఫ్ డైరెక్టర్ మధు కొర్రపాటి, బోర్డు సెక్రెటరీ శ్రీధర్ అప్పసాని, హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ హరీందర్ గరిమెళ్ళ మరియు హెల్ప్ లైన్ టీం విష్ణు పుప్పల కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఈ చికిత్సకు ఎక్కువ ఖర్చు కానున్న నేపథ్యంలో నాట్స్ హెల్ప్ లైన్ వెంటనే రంగంలోకి దిగి విష్ణు కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చింది. వెనువెంటనే నాట్స్ హెల్ప్ లైన్ టీం, దాతల సహకారంతో 15 వేల డాలర్ల మొత్తాన్ని సేకరించింది. ముందు వైద్య ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో విష్ణు కుటుంబానికి అందించారు. విరాళల సేకరణలో కీలక పాత్ర పోషించిన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ జాయిట్ కోశాధికారి శేఖర్ అన్నే, నాట్స్ డాలస్ చాప్టర్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మర్నేని, కిషోర్ వీరగంధం తదితరులు విష్ణు పుప్పల కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇంకా కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలోనే విష్ణు పుప్పల ఉండాల్సిన అవసరం ఉంది. అంతే కాకా వారికి ఎలాంటి అవససరం వచ్చినా వెన్నంటి ఉండి సహాయం అందిస్తామని నాట్స్ భరోసా ఇచ్చింది.








