7న న్యూజెర్సిలో నాట్స్ కర్టెన్‌రైజర్ వేడుకలు
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) చికాగోలో నిర్వహిస్తున్న సంబరాలను పురస్కరించుకుని న్యూజెర్సిలో ఏప్రిల్ 7వ తేదీన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాట్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా న్యూజెర్సి అసెంబ్లీ మాజీ స్పీకర్, పబ్లిక్ యుటిలిటిస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల హాజరవుతున్నారు. కళారత్న మేస్ట్రో గజల్ శ్రీనివాస్ ప్రత్యేక అతిధిగా వస్తున్నారు. గాయకులు ఎస్.పి బ్రదర్స్, మిమిక్రీ రమేష్, గాయని అదితి భావరాజు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నటీనటులు కూడా వస్తున్నారని, ఈ కార్యక్రమానికి తెలుగు కుటుంబాలవారు అందరూ హాజరుకావాలని నాట్స్ ఓ ప్రకటనలో కోరింది.







