నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వ్లూ వ్యాక్సిన్
సెయింట్ లూయిస్ లో నాట్స్ సేవా కార్యక్రమాలు
అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సేవా కార్యక్రమాలతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరవుతుంది. తాజాగా సెయింట్ లూయిస్ లోని హిందు టెంపుల్ లో నాట్స్ ఉచిత వ్లూ వ్యాక్సిన్స్ వేయించింది. నాట్స్ డైరక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి,సెయింట్ లూయిస్ హిందు టెంపుల్ ట్రస్టీ జీవీ నాయుడు, నాట్స్ కోశాధికారి శ్రీనివాస మంచికలపూడి నాయకత్వంలో ఈ ఫ్రీ వ్లూ వ్యాక్సిన్ కార్యక్రమం జరిగింది. దాదాపు 250 మందికి వైద్యులు ఈ ప్లూ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.
స్థానిక వైద్యులు వాణి, ధర్మవరపు, శ్రీదేవి గవిరినేని, రమ అట్లూరి, వెంకట్ బోడావుల, కృష్ణమోహన్, డా. వాణి పచ్చల ఈ కార్యక్రమంలో తమ విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది. విశ్వేశ్వరరావు కాజా, నాగ శ్రీనివాస్ శిష్ట్ల, చిన్న ముచ్చెర్ల, నాట్స్ జాతీయ హెల్ఫ్ లైన్ కో ఆర్డినేటర్ హరీందర్ గరిమెళ్ల నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ సతీష్ ముమ్మనగండి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో కీలకపాత్ర పోషించారు. హిందు టెంపుల్ వాలంటీర్ హేమ ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందించినందుకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ప్రజలు సహకారంతో ఇలాంటి మరో కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధంగా ఉందని నాట్స్ ప్రకటించింది. నాగశ్రీనివాస్ శిష్ట్ల, విశ్వేశ్వరరావు కాజా, శ్రీనివాస్ మంచికలపూడిలు గతంలో బోన్ మారో డ్రైవ్ కూడా ఇక్కడ విజయవంతంగా నిర్వహించారని .. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు సెయింట్ లూయిస్ లో జరగనున్నాయని నాట్స్ కోశాధికారి శ్రీనివాస్ మంచికలపూడి తెలియచేసారు.








