చికాగోలో చిన్నారుల చిందులు!
అంబరాన్నంటిన తెలుగు సంబరాలు!!
జూన్ 30 నుండి జులై 2 వరకు మూడు రోజులపాటు నాట్స్ నిర్వహించిన తెలుగు సంబరాలు ఎంతో రసవత్తరంగాను మరియు హృద్యమంగాను సాగాయి. సాహిత్య చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ కళాకారుల సందళ్ళు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. జంటతెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాస తెలుగు వారు వేలాది సంఖ్యలో పాల్గొన్న ఈ సంబరాల్లో వందలాది కళాకారులూ వివిధ కళారీతుల్ని ప్రదర్శించారు. సంగీతం, సాహిత్యం, నాటకం, నృత్యం, వేదాంత గోష్టి, హాస్యం, అనుకరణ ఇలా ఎన్నెన్నో ప్రదర్శనలు ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి.టేనస్సీ రాష్ట్రం, కార్డోవ పట్టణానికి చెందిన ఇండియన్ బాలే థియేటర్ చిన్నారులు చిందులు కూచిపూడి నృత్యానికి కొత్త నడకలు నేర్పింది. పట్టుమని ఆరు సంవత్సరాలైనా నిండని వైష్ణవి పిల్లి, అశ్విక బండారు, అస్మిత బొడ్డు, శాన్వి కుంటమల్ల, నిధి నిహారిక చెన్నం అన్నమయ్య కీర్తనలుకొలని దోపరికి గొబ్బిళ్ళో, ముద్దుగారే యశోద, శ్రీ రామ నీ నమ మెంతో రుచిరా, అదిగో అల్లదిగో శ్రీహరివాసము చక్కని హావభావాలతో ప్రదర్శించారు. వీరితో పాటు శ్రీమతి చంద్ర ప్రభ మరియు డాక్టర్ రమణ వాసిలి దంపతులు “ఆనంద తాండవమాడే” అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీమతి చంద్రప్రభ మరియు డాక్టర్ రమణ వాసిలి నేతృత్వంలో గురు మరియు శుక్రవారాల్లో కాళీర్వీల్లె పట్టణంలోని హోలీ అపోస్టల్స్ చర్చిలో, శని మరియు ఆదివారాల్లోమెంఫిస్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కూచిపూడి నృత్య శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
Dr. Ramana Vasili
Spiritual Foundation, Inc.
901-387-9646








