ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు
చికాగోలోని రినైసాన్స్ కన్వెన్షన్ సెంటరులో మూడురోజుల పాటు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 5వ అమెరికా తెలుగు సంబరాలు ఆదివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా ముగిశాయి. అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, కన్వీనర్ ఆచంట రవిలు వేడుకల విజయవంతానికి తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.








