నాట్కో ఔషధానికి ఎఫ్‌డిఎ అమోదం
నాట్కో ఫార్మా మరో కీలక ఔషధానికి సంబంధించి అమెరికా ఎఫ్‌డిఎ అనుమతి సాధించింది. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అజాసైటిడైన్ ఇంజెక్షన్ 100ఎంజి (సింగిల్ డోస్ వయెల్ )కి సంబంధించి తమ ఎఎన్డిఎ (అండా)కు అమెరికా ఎఫ్‌డిఎ అనుమతి లభించినట్టు నాట్కో వెల్లడించింది. ఈ ఔషధాన్ని బ్రెకెన్రిడ్జ్ ఫార్మా భాగస్వామ్యంలో అమెరికాలో ప్రవేశపెడతారు. సెల్జర్ కార్పొరేషన్‌కు చెందిన పేటెంటెడ్ ఔషధం వైడజాకు ఆజాసైటి డైన్ జెనరిక్ వెర్షన్. ఏప్రిల్ 2017తో ముగిసిన 12 నెలల కాలంలో ఈ ఔషధం విక్రయాల మొత్తం 18.8 కోట్ల డాలర్లు ఉన్నట్లు నాట్కో తెలిపింది.













