డిసెంబర్లో నాటా సేవా కార్యక్రమాలు
రెండేళ్లకోసారి తెలుగు రాష్ట్రాల్లో నాటా డేస్ పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఈ ఏడాది డిసెంబర్ 10-24 వరకు నిర్వహించనున్నట్లు నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్యక్షులు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు ఈసారి బెంగళూరులోని తెలుగువారికోసమే ఈ సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వెల్లడించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు ప్రాంతాల్లో తాగునీటి శుద్ధి కేంద్రాలు, మురుగుదొడ్లు, ప్రభుత్వ జూనియర్ కళశాలల్లో ప్రతిభచూపిన 125 మంది విద్యార్థులకు రూ.10వేల చొప్పున ఉపకారవేతనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశిబిరాలు, ఎల్ఈడీ విద్యుత్తుదీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్తూరు వరంగల్ పట్టణాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, అక్షరాస్యతపై నడకలు నిర్వహిస్తున్నామన్నారు.













