డెలావేర్లో నాటా పిక్నిక్
డెలావేర్లో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో జూలై 16వ తేదీన జరిగిన పిక్నిక్ పూర్తిగా విజయవంతమైంది. ఈ పిక్నిక్ కార్యక్రమానికి దాదాపు 500 మందికిపైగా హాజరయ్యారు. నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని, నాటా ప్రెసిడెంట్ ఎలక్ట్ రాఘవరెడ్డి గోశాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి ప్రోత్సాహంతో నాటా డెలావేర్ టీమ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.








