గాలి నాణ్యతను గుర్తిసే లక్ష డాలర్ల బహుమతి
గాలిలో నాణ్యతను కొలిచే సెన్సార్ను తయారు చేసిన వారికి లక్ష డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భూమి మీదైనా, అంతరిక్షంలో అయినా మనిషి బతకడానికి అనుగుణమైన గాలి ఎంతో అవసరం. గాలిలో ఉండే చిన్న ధూళికణాలను ఎయిరోసోల్స్ అంటారు. గాలిలో వీటి శాతాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు. ఇవి ఎంత శాతం ఉన్నాయో తెలిపే సెన్సార్ను కనిపెట్టిన వారికే ఈ బహుమతి అందుతుంది. ఈ సెన్సార్ను చాలా తక్కువ ఖర్చుతో, వీలైనంత తక్కువ బరువుతో ఎక్కడైనా ఉపయోగించేలా తయారు చేయాలి. నాసా, రాబర్ట్ ఉడ్ జాన్సన్ ఫౌండేషన్ (ఆర్డబ్లూజేఎఫ్) కలసి ఈ బహుమతిని ప్రకటించాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 13లోపు దరఖాస్తు చేసుకొని వచ్చే ఏడాది జనవరి 31లోపు పరికరాన్ని వారికి సమర్పించాలి.













