మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకనున్న ట్రంప్
భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఒక ప్రత్యేకత గుర్తింపును పొందనున్నది. మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ పర్యటన విషయంలో వైట్ హౌస్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని, రెడ్ కార్పెట్ స్వాగతం పలకనున్నామని వైట్ హౌస్కు చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఇద్దరు నేతలు వర్కింగ్ డిన్నర్లో పాల్గొంటారని ఆ ఆధికారి అన్నారు.








