వాషింగ్టన్ డిసి విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నిజమైన మిత్రుడు’గా అభివర్ణించారు. సోమవారం శే్వతసౌధంలో ప్రధాని మోదీతో వ్యూహాత్మక అంశాలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘శే్వతసౌధంలో ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం స్వాగతం చెప్పేందుకు ఎదురు చూస్తున్నాను. ఒక నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక అంశాలను చర్చించబోతున్నాం’ అని ట్రంప్ తన అధికారిక ట్విట్టర్లో ఉంచిన ట్వీట్లో వ్యాఖ్యానించారు. కాగా, తనకు వ్యక్తిగత హార్దిక స్వాగతం పలికినందుకు ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం శే్వతసౌధంలో ట్రంప్‌తో సమావేశం, చర్చల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తన్నట్లు ట్రంప్ ట్వీట్‌కు సమాధానంగా చేసిన ట్వీట్లో మోదీ అన్నారు. కాగా, రెండు రోజుల అమెరికా పర్యటనకోసం ఆదివారం వచ్చిన ప్రధాని మోదీకి వాషింగ్టన్ డిసి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయన సోమవారం మధ్యాహ్నం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో ముఖాముఖి చర్చలు జరపనున్నారు. అలాగే మోదీ గౌరవార్థం ట్రంప్ విందు ఇవ్వబోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఒక విదేశీ నేతకు ఇస్తున్న తొలి విందు ఇదే కావడంతో ఈ విందుకు ఎంతో ప్రాధాన్యత లభించింది.








