అమెరికాలో తెలుగు వైద్యుడు దారుణ హత్య
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సైక్రియాటిక్ వైద్యుడు అచ్యుత్‌రెడ్డి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారున. అచ్యుతరెడ్డి కాన్సాస్ రాష్ట్రంలోని విచితలో హోలిస్టిక్ క్లీనిక్‌ను రన్ చేస్తున్నారు. సొంత క్లీనిక్‌లోనే ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఈ ఘటన గత బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అచ్యుతరెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేశారు. 1989 నుంచి విచితలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే విధంగా విచితలోనే హోలిస్టిక్ సైక్రియాట్రిక్ సర్వీస్‌ను రన్ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి ఆసుపత్రికి వచ్చి డాక్టర్ అచ్యుత్రెడ్డితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కత్తి తీసి పలుమార్లు వైద్యుడిని పొడిచాడు. దీంతో డాక్టర్ అత్యుత్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన కొద్ది సమయంలోనే నిందితుడిని స్థానిక కంట్రీ క్లబ్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, హత్య చేసిన వ్యక్తి గుర్తింపు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.








