ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ ఫ్లవర్
అమెరికాలోని కాలిఫోర్నియాలో దాదాపు 2,400 మంది ప్రజలు తామర పువ్వు ఆకృతిలో ఓ చోట చేరి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యూమన్ ఫ్లవర్గా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. దీనికి స్థానిక ఆసియన్ ఆర్ట్ మ్యూజియం వేదికైంది. ప్రజలంతా దాదాపు 5 నిమిషాలపాటు తామర పువ్వు ఆకృతి లో ఉండిపోయారు. ఈ మేరకు మ్యూజియం అధికారులు దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. బురద నీటి నుంచి ఉద్భవించిన తామర పువ్వు శ్రేష్ఠతకు మారుపేరనీ, కఠోర శ్రమకు వచ్చిన ఫలితానికి ప్రతీక అని వారు ఫేస్బుక్లో పేర్కొన్నారు.








