నిమిషంలో 51 బస్కీలు
ఒకటి రెండు మూడు ఇలా పది బస్కీలు తీసి ఇక చాలు అంటూ ముగించేస్తాం. కానీ అమెరికాకు చెందిన వ్యాయామ ఔత్సాహికుడు ఆడం సాండేల్ అలా ఊరుకోలేదు. ఒక్క నిమిషంలో 51బస్కీలు తీసి సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. ఒక నిమిషంలో అత్యధిక బస్కీలు తీయడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించడంతోపాటు గతంలో ఉన్న 50 బస్కీల రికార్డును అధిగమించాడు.








