డొనాల్డ్ ట్రంప్‌కు తగ్గిన ఆదరణ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు దాటిన సందర్భంగా టైమ్ సర్వేమంకీ ఓ ఒపీనియల్ పోల్ నిర్వహించి, అమెరికన్ల అభిప్రాయాలను సేకరించింది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ చేసిన హామీలు నెరవేరు తాయా అని అడిగిన ప్రశ్నకు అమెరిన్లు నో అనే సమాధానమే అధికంగా చెప్పారు. కేవలం 25శాతం అమెరికన్లే ఇందుకు ఎస్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి లోనూ ఇటువంటి సర్వే నిర్వహించారు అయితే అప్పట్లో 31 శాతం మంది ట్రంప్ హామీలు నెరవేరుస్తారని అభిప్రాయపడగా ఈ తాజా సర్వేలో మాత్రం మరి ఆరు శాతం మంది ప్రజలు ట్రంప్‌పై విశ్వాసం ప్రకటించలేకపోయారు. మరి రెండు రోజుల్లో (ఈ నెల 29తో) డొనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలన పూర్తి కానుంది.













