అట్లాంటాలో మంత్రి మహేందర్‌రెడ్డి
అట్లాంటాలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి భారత కన్సోలేట్ నగేశ్ సింగ్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో అట్లాంటాలోని ఆటా, గేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా అట్లాంటాకు ఎయిరిండియా విమానాలు నడిపే అంశంపై భేటీలో చర్చించారు. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో చర్చించి విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తానని మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.








