వాషింగ్టన్ పారిశ్రామిక సదస్సుకు కేటీఆర్
అమెరికా, భారత వాణిజ్య మండలి ఆధ్వర్యంలో వచ్చే సెప్టెంబర్ 12న వాషింగ్టన్లో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వాణిజ్య మండలి ఉపాధ్యక్షుడు ఎమి హరియాని మంత్రికి లేఖ రాశారు. అమెరికా, భారత్‌తోపాటు, ఇతర దేశాల నుంచి ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. అమెరికా భారత్‌ల మధ్య వాణిజ్య పురోగతి తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాంకా ట్రంప్, విదేశాంగ మంత్రి రెక్స్‌టిల్లర్‌సన్ ఇందులో ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం మెరుగుదలకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రసంగించాలని హరియాని కేటీఆర్ తన లేఖలో కోరారు.








