100 ఏళ్ల తర్వాత అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం
సుమారు 100 ఏళ్ల తర్వాత అమెరికాలో నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంపూర్ణంగా కనిపించనుంది. అమెరికాలో ప్రధానంగా 12 రాష్ట్రాల్లో దీని ప్రభావం పూర్తిగా ఉంటుంది. భారత కాలమాన ప్రకారం ఆగస్టు 21 రాత్రి 9:16 గంటల నుంచి 12:52 వరకు ఈ సూర్య గ్రహణాన్ని చూడవచ్చు. ఈ గ్రహణాన్ని ప్రపంచం మొత్తం వీక్షించడం కోసం నాసా తన వెబ్‌సైట్‌తో పాటు, ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లోనూ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కాగా, ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావంతో ప్రస్తుతం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న హరికేన్ తీవ్రత తగ్గునుందని విశాఖకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త నలవాగుల మనోజ్ వెల్లడించారు.













