మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాల కోత!
కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 3000 వరకు ఉద్యోగాల్లో కోత వేయనుందని తెలుస్తోంది. వినియోగదార్లకు, భాగస్వాములకు మెరుగైన సేవలను అందించేందుకు కోసం కంపెనీ కొన్ని మార్పులు చేపడుతోందని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఉటంకిస్తూ సీఎన్బీసీ తన కథనంలో పేర్కొంది. కొంత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. అన్ని కంపెనీల్లాగే సాధారణంగా జరిపే వ్యాపార సమీక్షల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెరగవచ్చని ఆ ప్రతినిధి తెలిపారు. కంపెనీ మొత్తం విక్రయ సిబ్బందిలో 10 శాతం తక్కువే కోత వేయనున్నట్లు అందులో 75 శాతం మంది అమెరికా బయటివారేనని సీఎన్బీసీ తన కథనంలో వివరించింది.








