ట్రంప్ తో సెల్ఫీలు దిగాను… మా ఆయన వదిలేశాడంటున్న చీర్ లీడర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దిగిన సెల్ఫీలు తన కాపురాన్ని కూల్చాయని బాధపడుతోంది ఓ చీర్ లీడర్. ఆయనపై అభిమానంతో సెల్పీలు దిగితే, తన భర్తతో గొడవలు వచ్చాయని వాపోయింది. ఇంకాస్త లోతైన సమాచారానికి వెళితే, గతంలో అమెరికన్ పుట్‌బాల్ జట్టు మియామి డాల్ఫిన్స్‌కు చీర్ లీడర్‌గా పని చేసిన లిన్ అనే యువతి, ఫ్లోరిడాకు చెందిన డేవ్ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అధ్యక్షుడు కాక ముందు నుంచే లిన్‌కు డొనాల్డ్ ట్రంప్ అంటే ఎంతో ఇష్టం. తన పెంపుడు కుక్కకు ట్రంప్ కూతురు ఇవాంక పేరు పెట్టుకుని ముద్దుగా సాకేది. ఇక ట్రంప్ అధ్యక్షుడైన తరువాత పలు మార్లు ఆయన్ను కలిసి సెల్ఫీలు దిగింది. ట్రంప్‌ను తన భార్య పదేపదే కలవడం డేవ్‌కు ఇష్టం లేకపోగా, తరచు వారి మధ్య గొడవలు జరిగేవి. దీంతో ఇద్దరు కోర్టుకు ఎక్కువగా, విడాకులు మంజూరయ్యాయి. తాము విడిపోవడానికి కారణం ట్రంపేనని అంటోంది లిన్.








