డొనాల్డ్ ట్రంప్ కు మళ్లీ షాక్ ఇచ్చిన మెలానియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మళ్లీ హ్యాండిచ్చింది మెలానియా ట్రంప్. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రంప్ దంపతులు రోమ్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తమ ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి దిగే సమయంలో మరోసారి మెలానియా చేయి పట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా ఆమె ట్రంప్‌కు చేయ్యి ఇవ్వకుండా తన జుట్టును సరి చేసుకుంది. అది కవర్ చేసుకోవడానికి ట్రంప్ అమె వెనక తట్టి ముందుకు వెళ్దామన్నట్లు సైగా చేశారు. ఇది కూడా కెమెరా కంటికి చిక్కడంతో మరోసారి సోషల్ మీడియా ట్రంప్‌తో ఆడుకుంది. అయితే మెలానియా ఇలా కావాలని చేశారో, లేదో యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు గానీ, ఇప్పుడు ట్రంప్ జంట నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి తోడు ట్రంప్ అధ్యక్షుడై నెలలు గడుస్తున్నా మెలానియా ఇంకా శ్వేతసౌధంలోకి మారకపోవటం కూడా వారి మధ్య విబేధాలు ఉండొచ్చనే అనుమానాలకు తావిస్తున్నాయి. దీంతో మెలానియా ట్రంప్‌ను పట్టించుకోవట్టేదని నెటిజన్లు తెగ కామెంట్లు చేసేస్తున్నారు.













