మెలానియా ట్రంప్‌కు విదేశీ పర్యటనల మేనియా!
అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్‌కు ఇతర దేశాల్లో పర్యటించడమంటే బాగా ఇష్టమున్నట్లు ఉంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ వెళ్లే ప్రతి విదేశీ పర్యటనకు ఆమె బ్యాగు సర్దుకొని సిద్ధంగా ఉంటుంది. అంతే కాకుండా ట్రంప్ రానున్న కూడా ఆమే స్వయంగా విదేశాలు చుట్టివచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. దీంతో స్వదేశం కంటే విదేశాల మీదే మెలానియాకు మమకారం ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. భర్తతో కలిసి విదేశాల్లో పర్యటించడమే కాదు అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో మెలానియా తన వంతు ప్రసంగాలు కూడా ఇస్తుంది. అలాగే ఆయా దేశాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో గమనిస్తే తన స్వదేశం అమెరికాలో మెలానియా ప్రసంగాలు ఇచ్చిన దాఖలాలు గానీ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితులు గానీ పెద్దగా కనిపించవు. స్లోవేనియాలో జన్మించిన మెలానియా ఆరు అంతర్జాతీయ భాషలు గలగలా మాట్లాడుతుంది. ఇటలీ వెళ్లినపుడు ఇటాలియన్లో, ఫ్రాన్స్ వెళ్లినప్పుడు ఫ్రెంచ్‌లో మాట్లాడి అందరీ ఆకట్టుకునే మెలానియాను తనతో పాటు తీసుకువెళ్లడానికి ట్రంప్ కూడా మొగ్గు చూపుతారని వైట్ హౌస్ వర్గాలు పేర్కొంటున్నాయి.








