దేశవ్యాప్తంగా ఫేస్ బుక్ సీఈవో పర్యటన
దేశవ్యాప్తంగా తాను గతంలో ఎప్పుడూ పర్యటించని అన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది పర్యటించేందుకుగాను రూపొందించుకున్న ప్రణాళికల వెనుక రాజకీయ ఉద్దేశమేమీ లేదని ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) మార్క్ జుకర్బర్గ్ సృష్టం చేశారు. తాను పదవుల కోసం ప్రయత్నించడం లేదని తెలిపారు. ప్రజా సంబంధాలను మెరుగుపర్చుకునేందుకే ఈ పర్యటనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్త పర్యటనల వెనక రాజకీయ కోణమేమైనా ఉందంటూ కొందరు ప్రశ్నించిన నేపథ్యంలో ఫేస్బుక్లో ఓ పోస్టు ద్వారా జుకర్బర్గ్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.








