ఇక్కడే నేను ఫేస్‌బుక్‌ను కనిపెట్టింది.. జుకెర్‌బర్గ్
13 ఏండ్ల క్రితం మార్క్ జుకర్‌బర్గ్ సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారు. ఫేస్బుక్ ఈ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు అతడు ఊహించలేదు. అంతలా ప్రాచుర్యం పొందిన ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను జుకర్‌బర్గ్ ఎక్కడ ప్రారంభించాడో తెలుసా? ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో. ఈ విషయాన్ని జుకర్ స్వయంగా చెప్పడమేగాక, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆ గదిని ప్రపంచానికి పరిచయం చేశారు. కేంబ్రిడ్జ్‌లోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో జుకర్‌బర్గ్‌కు సీటు వచ్చింది. అక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే ఫేస్‌బుక్‌ను డెవలప్ చేశారు. 2014, ఫిబ్రవరి 4న ది ఫేస్బుక్ పేరుతో ఓ సోషల్ మీడియా ఫ్లాంట్ఫాంను ప్రారంభించారు. అయితే చదువు వల్ల దానిపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నానని భావించిన జుకర్, అదే ఏడాది హార్వర్డ్ను వదిలేసి వచ్చారు. అలా 2006లో డిగ్రీ పూర్తి చేయాల్సిన జుకర్, ప్రపంచానికి ఫేస్‌బుక్‌ను పరిచయం చేసిన వ్యక్తిగా అరుదైన గుర్తింపు సాధించారు.








