అమెరికాలో ఏపీ ఐటీ ప్రతినిధిగా మనోహర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ ఎన్నారై ఐటీ నిపుణుడు ఎం.ఆర్. మనోహర్‌రెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా ఏపీ ఐటీ ప్రతినిధిగా నియమించారు. ప్రభుత్వ విధానాలను అక్కడి కంపెనీల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్థలకు ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి ఆయన కృషి చేయనున్నారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మనోహర్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని పలు ప్రముఖ ఐటీ కంపెనీలకు సీఈవోగా వ్వవహరిస్తున్నారు.








