జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడిగా మన్నె సత్యనారాయణ
అమెరికాలోని గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షుడిగా మన్నె సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామం. దీర్ఘకాలంగా ఆయన ఈ సంఘానికి పలు సేవలందిస్తున్నారు.








