ట్రంప్ మాజీ భార్యను కలిసిన బాలీవుడ్ నటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్‌ను, బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ కలిశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మల్లిక అనుకోకుండా ఇవానాను కలిశారట. ఈ సందర్బంగా ఆమెతో సెల్ఫీ దిగి ట్విటర్లో షేర్ చేశారు. ఇవానా గొప్ప మహిళ అని, ఆమెను కలుసుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఒకప్పుడు మోడల్ అయిన ఇవానా, ట్రంప్‌ను 1977లో వివాహం చేసుకున్నారు. 1992లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇవాంకా ట్రంప్ వీరి కూతురే. ప్రస్తుతం ఇవానా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.








