మాలియా ఒబామా నా… మజాకా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా పెద్ద కుమార్తె మాలియా ఒబామా ఇంటలిజెన్స్ సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒబామా పదవీ బాధ్యతల నుంచి నిష్క్రమించిన అనంతరం పెద్దగా బాహ్య ప్రపంచం ముందుకు రాని మాలియా ఇటీవల న్యూయార్క్‌లోని మాన్హటన్ ప్రాంతంలో బి బార్ అండ్ గ్రిల్‌కు డిన్నర్‌కు వెళ్లింది. ఒక్కసారిగా మాలియాను చూసిన పలువురు తమ సెల్ ఫోన్ కెమెరాలకు పని చెప్పారు. ఇవేమీ పట్టించుకోని మాలియా బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బార్లో ఒక మూల ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని డిన్నర్ కానిచ్చింది. దీంతో ముందస్తు సమాచారం లేకుండా మాజీ అధ్యక్షుడి కుమార్తె బార్‌కు వెళ్లడంతో ఇంటలిజెన్స్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమె అక్కడి నుంచి నిష్క్రమించే వరకు ఆ పరిసరాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని ఆ సమయంలో బార్‌కు వెళ్లిన వారు తెలిపారు. ఇవేవీ పట్టించుకోని మాలియా, ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం హాయిగా డిన్నర్ ముగించి వెళ్లిపోయారని వారు తెలిపారు.













