ఆయన ప్రథమ పౌరుడిగా సరిపోడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా, ఏం మాట్లాడిన సంచలనమే అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటంపై సగం మంది అమెరికా ఓటర్లు అసహనంగా ఉన్నారట. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ట్రంప్ అధ్యక్ష పదవికి సరిపోడని 51 శాతం మంది చెప్పారు. క్విన్నిపియాక్ అనే సంస్థ ఇటీవల అమెరికా అధ్యక్షుడి పనితీరుపై ఓ పోలింగ్ నిర్వహించింది. సెప్టెంబర్ 21 నుంచి 26 మధ్య ఫోన్ ద్వారా అమెరికా ఓటర్ల నుంచి ట్రంప్‌పై అభిప్రాయాలు సేకరించింది. ఇందులో 51 శాతం మంది ప్రజలు ఆయన ప్రథమ పౌరుడిగా సరిపోడని చెప్పారట. ఇక ట్రంప్ నిజాయతీపరుడు కాడని 59 శాతం మంది, ఆయనకు మంచి నాయకత్వ లక్షణాలు లేవని 60 శాతం మంది చెప్పారు.













