Madhuravani.com నిర్వహించే రెండవ ఉత్తమ రచనల పోటీ
గత ఏడాది 2016 దసరా-దీపావళి సందర్భంగా మేము నిర్వహించిన మొదటి ఉత్తమ రచనల పోటీ మంచి విజయం సాధించింది. అదే స్ఫూర్తి తో అనుభవజ్ఞులు, ఔత్సాహిక, నూతన అంతర్గత రచయితల సృజనాత్మకతని గుర్తించడానికీ, నూతన సాహిత్య సృష్టికి మా వంతు దోహదం చెయ్యడానికీ 2017 దసరా-దీపావళి పండుగుల సందర్భంగా రెండవ సారి ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.
కథా మధురాలు
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $50
పది సమాన బహుమతులు: ఒక్కొక్కటీ: $25
కవితా వాణి
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $50
పది సమాన బహుమతులు: ఒక్కొక్కటీ: $25
వ్యాస మధురాలు
తెలుగు భాషా, సాహిత్య పరిశోధనా వ్యాసాలు
(కళాశాల, విశ్వ విద్యాలయ ఆచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకి మాత్రమే)
మూడు సమాన బహుమతులు ఒక్కొక్కటీ: $50
పంపవలిసిన చిరునామా













