మధురవాణి.కామ్ జులై 1, 2017 సంచిక విడుదల
Madhuravani.com జులై సంచిక-2017 నిన్న కాక మొన్న ..అనగా జులై ఒకటో తారీకున విడుదల అయిందోచ్!
.ఏమిటీ? ఇంకా చదవ లేదా?
భలే వారే…యమర్జెంటుగా చదివి ఆనందించి మాకు కానీ ఆయా రచయితలకి కానీ మీ అభిప్రాయం పంచుకోండి.
ఎందుకంటే…
ముందుగా ఈ సంచిక నుండీ సుప్రసిద్ధ కవి శ్రీ విన్నకోట రవిశంకర్ (కొలంబియా, NC, USA) గారు కవిత వాణి విశిష్ట సంపాదకులు గా స్వచ్చందంగా (అనగా మాలో ఎవరికీ జీతభత్యాలు లేవు. ఉన్న ఆస్తి అల్లా తెలుగు భాషాసాహిత్యాల పట్ల ఆపేక్ష మాత్రమే) బాధ్యతలు స్వీకరించారు. అమెరికా కవుల్లో ప్రముఖంగా వినపడే విన్నకోట రవిశంకర్ పేరు జగద్వితమే. “రవి గాంచనిచో కవి గాంచును కదా” అన్న నానుడి ఈ రవిశంకర్ విషయంలో అన్వయించదు. ఎందుకంటే కవిత్వానికీ, ‘కపిత్వానికీ’ ఉన్న తేడా స్పష్టంగా తెలిసి, అది అంత కన్నా స్పష్టంగా చెప్పగలిగిన ఈ రవి ‘గాంచనిది’ లేనే లేదు. కావాలంటే ఇటీవల మేము….(అనగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా) ప్రచురించిన విన్నకోట రవిశంకర్ విరచిత “కవిత్వంలో నేను -మరికొన్ని వ్యాసాలు’ అనే పుస్తకం మీద వచ్చిన ఒక సమీక్ష చదవండి.
http://epaper.navatelangana.com/m5/1224506/NavaTelangana/29.05.2017#page/4/1
విన్నకోట రవిశంకర్ లాంటి కవి, కవిత్వ విశ్లేషకుడు మా సంపాదక బృందంలో తన సేవలు అందించడాన్ని స్వాగతిస్తున్నాం.
అంతే కాదు..
ఈ సంచికతో మొదలు పెట్టి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న లభ్దప్రతిష్టులు..ఒకరా. ఇద్దరా…ఏకంగా నలుగురు.. తమ విలువైన సృజనాత్మక సమయాన్ని కేటాయించి మధురవాణి లో ప్రత్యేక శీర్షికలు అందిస్తున్నారు.
వారెవరూ తెలుసకోవాలని కుతూహలంగా ఉందా? ఎందుకు ఉండదూ? అయితే వెంటనే www.madhuravani.com కి వెళ్లి కనుక్కోండి…
పోనీ లెండి..అంత సస్పెన్స్ ఎందుకూ..భరించ లేరు…అంచేత వారెవరూ కొన్ని క్లూలు ఇస్తాను.
ఒక చంద్రుడు గొప్ప వాన పాటలె కాక, మంచి కథలూ, ఆధ్యాత్మిక వ్యాసాలూ వ్రాస్తూ మీసాలు దువ్వుకుంటూ ఉంటారు.
ఒకావిడ సినిమా కథలు, బుల్లి తెర సంభాషణలు, హాస్యం తొణికిసలాడే వ్యాసాలూ రమణీయంగా వ్రాస్తారు.
ఒకాయన అమెరికాలో ఉన్నా అసత్యం ఆడకుండా నలభై ఏళ్లగా నిత్యమూ సాహిత్య పరంగా ఏదో ఒకటి వ్రాస్తూనే ఉంటారు.
ఒకావిడ తన అంతర్జాల పత్రిక నిర్వహిస్తూనే, పుస్తకాలు ప్రచురిస్తూనే, తెలంగాణా వంటల మీద పుస్తకం వ్రాసి అందరికీ నేర్పిస్తూనే సాహిత్యం జ్యోతి వెలిగిస్తూ ఉంటుంది.
ఈ ఆత్మీయ సాహితీవేత్తలకి స్వాగతం పలుకుతున్న్నాం. వారెవరూ ఊహించుకుని అప్పుడు ఆయా శీర్షికలు తాజా మధురవాణి.కామ్ లో చదివి ఆనందించండి. వేణు వెంటనే స్పందించండి.
అన్నట్టు, మర్చేపోయాను.
గత సంవత్సరం మొదలుపెట్టిన సాంప్రదాయం ప్రకారం ఈ ఏడు కూడా మధురవాణి దసరా-దీపావళి ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితల ని ఈ పోటీ లో పాల్గొనమని అర్థిస్తున్నాం. పూర్తి వివరాలు తాజా మధురవాణి.కామ్ లో చూడండి.
ఇక ఎంతో ఆసక్తికరంగా ఉండి, పాతకులకి వేలాది పాఠకుల అభినందనలు అందుకుంటున్న మన గొల్లపూడి గారి డైరీ లప్ ఒక పేజీ, వి.న్.ఆదిత్య ‘సినీ మధురాలు’, నేను వ్రాసిన సినారె గారెకి నివాళి, ముకుంద రామారావు, తమ్మినేని యదులు భూషణ్, అజంతా, అంజలి రచించిన కవితల సమాహారం, కథా మధురాలు (ఎవరివో మీరే చూడండి), దేప్తి ముచ్చట్లు, హాస్యవాణి, గొర్తి సాయి బ్రహ్మానందం, పాలపర్తి ఇంద్రాణి, ప్రసాద్ మైలవరపు రచించిన పుస్తకాల మీద శాయి రాచకొండ విశ్లేషణలు…వగైరా అన్ని శీర్షికలూ….మీరు చదివి ఆనందించ వలసినదే…తప్పదు మరి
మధురవాణా, మజాకా నా?













