2028 ఒలింపిక్స్ కు లాస్ ఏంజెల్స్ ఆతిథ్యం
2028 ఒలింపిక్స్‌కు అమెరికా లోని లాస్ ఏంజెల్స్ నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు లాస్ ఏంజెల్స్ టైమ్ డైలీ తెలిపింది. 2024 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను ఫ్రాన్స్‌లోని పారిస్ నగరానికి కట్టబెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. వాస్తవానికి గతానికి భిన్నంగా ఈసారి వరుస రెండు ఒలింపిక్స్ ఆతిధ్య హక్కులను బిల్డిండ్ ఒకేసారి జరుపాలని ఐవోసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ఏడాది జూన్‌లో 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పారిస్, లాస్ ఏంజెల్స్ నగరాలు బిల్డింగ్ దాఖలు చేశాయి. దీంతో 2014కు పారిస్, 2018 ఒలిపింక్స్‌కు లాస్ ఏంజెల్స్ నగరాలకును ఖరారు చేశారు. లాస్ ఏంజెల్స్ నగరం విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి కానుంది.













