మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నాం : అమెరికా
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా ఎదురు చూస్తోందని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా పర్యటన సందర్భంగా మోదీ తొలిసారి ట్రంప్‌తో సమావేశం కానున్న నేపథ్యలో ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీథర్ నౌరెట్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని సృష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరు సహా అనేక రంగాల్లో భారత్, అమెరికా పరస్పరం సహకారాన్ని పెపొందించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే మోదీ రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామని ఆమె ఉద్ఘాటించారు.








