నిద్రలేని పిల్లలకు భవిష్యత్తులో మధుమేహం!
తగినంత నిద్రలేని చిన్న పిల్లలు భవిష్యత్తులో మధుమేహం బారిన పడే ప్రమాదముందని అమెరికన్ స్లీప్ అసోసియేషన్ హెచ్చరించింది. ఎక్కువ కాలం నిద్రలేమితో బాధపడే పిల్లలు భవిష్యత్తులో ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని పరిశోధకులు హెచ్చరించారు. చిన్న ప్లిలలకు తగినంత నిద్ర అత్యవసరం. నిద్రలోనే మెదడు రీచార్జ్ అవుతుంది. ఆరోగ్యకర నిద్ర తర్వాత మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆ వయసులో వారికి తగినంత నిద్ర లేకపోతే భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. చిన్న పిల్లలో నిద్ర సమయాన్ని పెంచడం ద్వారా వారికి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చుని పరిశోధకులు వెల్లడించారు. నిద్రపోయే ముందు ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకోవడం, టీవీ చూడడం వంటివి చేయకుండా పిల్లలను కట్టడి చేయాలని వారు సూచించారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయించడం ద్వారా పిల్లల్లో నిద్రలేమి సమస్య దూరమవుతుందని తెలిపారు.













