ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వైద్యుడు
ఐర్లాండ్లో 38 ఏళ్ల భారత సంతతి వైద్యుడు లియో వరాడ్కర్ చరిత్ర సృష్టించారు. వలసదారుడి కుటుంబంలో జన్మించిన ఆయన దేశ ప్రధాని పదవిని అధిష్ఠించారు. ప్రధాని పీఠమెక్కిన అతి పిన్న వయస్కుడిగా, తొలి స్వలింగ సంపర్కుడిగా లియో ప్రత్యేకత సాధించారు. ఐర్లాండ్లో ప్రధాని పదవిని టీషక్ అని వ్యవహరిస్తారు. పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో లియో నియామకం ఖరారైంది. 57 ఓట్లు అనుకూలంగా, 50 వ్యతిరేకంగా వచ్చాయి. 47 మంది ఓటింగ్లో పాల్గొనలేదు.








