అమెరికాలో కాల్పుల కలకలం
అమెరికా శాసనకర్తల మధ్య ఏటా జరిగే బేస్బాల్ పోటీ కోసం సన్నద్ధమవుతున్న సభ్యులపై వాషింగ్టన్ శివార్లలో జరిగిన కాల్పుల్లో కనీసం అయిదుగురు గాయాల పాలయ్యారు. వీరిలో సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు విప్ స్టీవ్ స్కాలైస్, మరో సభ్యుడు రోజర్ విలియమ్స్, ఇద్దరు న్యాయాధికారులు కూడా ఉన్నారు. అయిదుగురినీ వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. కాల్పులు జరిపిన సాయుధుడిని భద్రత బలగాలు మట్టబెట్టాయి. పరిస్థితిని క్షణ్నంగా పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. నిందితుడిని నిర్వీర్యం చేసే క్రమంలో గాయపడినా ఏమాత్రం వెనక్కి తగ్గక పోరాడి పోలీసుల్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారు సకాలంలో స్పందించడం వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 25 మంది శాసనకర్తలు అక్కడ ఉన్నారు. బేస్బాల్ అడుతున్నవారు ఎవరనేది ముందుగా అడిగి తెలుసుకున్న తర్వాతే కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు.








