అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఘటన
ఇప్పటివరకు అమెరికా చరిత్రలో గన్ కల్చర్‌తో జరిగిన కాల్పుల్లో ఆదివారం రాత్రి మ్యూజికల్ నైట్ మీద జరిగిందే అతిపెద్ద దాడి ఘటన అని లాస్‌వేగస్ పోలీసులు ప్రకటించారు. గత ఏడాది ఒర్లాండోలో ఐఎస్ ప్రభావిత వ్యక్తి చేసిన దాడిలో 49 మంది చనిపోగా అదే అతి పెద్ద సంఘటనగా భావించారు. తాజా సంఘటనతో అది రెండోస్థానానికి వెళ్లింది.
భాధితుల్లో భారతీయులు లేరు
లాస్‌వేగాస్ ప్రమాద బాధితుల్లో భారతీయులు ఉన్నట్లు ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదని ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యలయం ఒక ప్రకటనలో సృష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. శాన్ఫ్రాన్సిలోని మన దౌత్య కార్యాలయం అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇప్పటికైతే మనవాళ్లు సురక్షితమే. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు అని రవీశ్ వెల్లడించారు.








