రష్యాతో కుమ్మక్కయిన మాట అవాస్తవం
గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తమ మామాగారి తరపు ప్రచారం కోసం తాను రష్యాతో కుమ్మక్కయినట్లు వచ్చిన వార్తలు అవాస్తమని డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సృష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విదేశీ ప్రభుత్వంతో ఎవరు కుమ్మక్కుయ్కారో తనకు తెలియదని ఆయన సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీకి, ప్రతినిధుల సభకు పంపిన ఒక ప్రకటనలో సృష్టం చేశారు.








