రష్యాతో కుమ్మక్కవలేదు : క్రుష్నర్
అమెరికా అధ్యక్ష పదవికి గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తరపు ప్రచారకర్తలు (క్యాంపెయిన్ మేనేజర్లు) రష్యాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలను ఆయన అల్లుడు, వైట్ హౌస్ సీనియర్ సలహాదారు క్రుష్నర్ తోసిపుచ్చారు. ఈ విషయంలో తాను దాచిపెట్టాల్సిన విషయమేమీ లేదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అమెరికా పార్లమెంటు దర్యాప్తు కమిటీలు త్వరలో ట్రంప్ అధికార గణాన్ని ప్రశ్నించనున్న నేపథ్యంలో క్రుష్నర్ 11 పేజీలతో కూడిన ఈ ప్రకటనను విడుదల చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ ప్రచారకర్తలు నాలుగుసార్లు రష్యన్లతో సంప్రదింపులు జరిపారని, అయితే ఇవేమీ అక్రమ సంప్రదింపులు కావని క్రుష్నర్ పేర్కొన్నారు.













