కాలిఫోర్నియాలో ఘనంగా కూచిపూడి నాట్య సమ్మేళనం
అఖిల అమెరికా కూచిపూడి న్యాట సమ్మేళనం కాలిఫోర్నియాలోని మిల్ పిటాక్స్లో ఘనంగా ప్రారంభమైంది. సిలికానాంధ్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, సృజనాత్మక, సాంస్కృతిక సమితుల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించే ఉత్సవంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కూచిపూడి నాట్యగురువులు, నర్తకీమణులు పాల్గొన్నారు. విశ్వయోగి విశ్వంజీ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. భూమాతకు భారతదేశం గుండెలాంటిదన్నారు. లలిత కళల ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నాలను అభినందించారు. సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ రెండేళ్లు సొంతగడ్డపైనే అంతర్జాతీయ కూచిపూడి న్యాట సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. అమెరికాలోని నాట్య గురువులు, నర్తకీనర్తకుల కోసం తొలిసారిగా అఖిల అమెరికా కూచిపూడి నాట్య సమ్మేళనానికి శ్రీకారం చుట్టామన్నారు.













