ఉల్లాసంగా కృష్ణా జిల్లా ఎన్నారైల వనభోజనం…
అమెరికాలోని పలు నగరాల్లో కృష్ణా జిల్లా వాసులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జిల్లాకు సాయం అందిస్తూ వివిధ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కనెటికట్, డెలావేర్ రాష్ట్రాల్లో నివసిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన ఎన్నారైలు న్యూజెర్సీలోని డొనాల్డ్సన్ పార్కులో వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు.నాలుగు రాష్ట్రాల నుంచి కృష్ణా జిల్లా వాసులు తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయి పలు కార్యక్రమాల్లో ఉలాసంగా పాల్గొన్నారు.








