డొనాల్డ్ ట్రంప్ చెప్పింది నిజమే
అమెరికా-రష్యా సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఘోరమైన స్థాయికి క్షీణించిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు రష్యా తెలిపింది. ట్రంప్ అభిప్రాయంతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాకు తెలిపారు. ట్రంప్ అభిప్రాయం గురించి ఆయన ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలిపారు. ఇరు దేశాలకు, వాటి ప్రజలకు అత్యంత కీలకమైన అంశాల పరంగా పరస్పర సహకారం లేకపోవడం వల్లే అమెరికా రష్యాల మధ్య బంధం ప్రమాదస్థాయికి చేరుకుని ఉంటుందని పెస్కోవ్ అభిప్రాయపడ్డారు.








