రాకెట్ కు డొనాల్డ్ ట్రంప్ పేరు
ఓ స్కూలు విద్యార్థులు తయారు చేసిన రాకెట్‌కు తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నార్త్ కరోలినాలోని విక్టోరియా క్రిస్టియన్ సెంటర్ పాఠశాల విద్యార్థులు తాము రూపొందించిన రాకెట్‌కు ట్రంప్ అని పేరు పెట్టారు. ఇక ఈ పేరెందుకు పెట్టారన్న ప్రశ్నకు ఇది అన్నింటిపై విజయం సాధిస్తుంది అని విద్యార్థులు సమాధానం ఇవ్వగా, విషయం అధ్యక్షుడి వరకూ వెళ్లింది. దీనిపై ట్రంప్ స్పందించి, విద్యార్థుల కృషికి అభినందనలు తెలిపారు. అమెరికా కార్మికులు ఇతర దేశాలకు అమ్ముడు పోవడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఆయన, ఉపాధి అవకాశాలను దెబ్బ తీసే నిబంధనలను రద్దు చేస్తామని సృష్టం చేశారు. ఇంధన రంగ అభివృద్ధిపై మరింత కృషి చేయనున్నామని ట్రంప్ చెబుతూ, నిలిచిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెడతానని హామీ ఇచ్చారు.








