భారత్లో అమెరికా రాయబారిగా కెన్నెత్ జస్టర్
భారత్లో అమెరికా కొత్త రాయబారిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కెన్నెత్ ఐ జస్టర్ నియామకానికి రంగం సిద్ధమైంది. 62 ఏళ్ల జస్టర్ ప్రస్తుతం అధ్యక్షుడికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో ఉప సహాయకుడిగా ఉన్నారు. జాతీయ ఆర్థిక మండలి ఉప సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. భారత రాయబారిగా జస్టర్ నామినేషన్ అనంతరం సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంది.








