ఎన్నారై దంపతుల హత్య
శాన్ఫ్రాన్సిస్కోలో భారత సంతతికి చెందిన నరేన్ ప్రభు దంపతులు హత్యకు గురయ్యారు. నరేన్ ప్రభు కూతురు ఓ యువకుడితో డేటింగ్ చేసింది. డేటింగ్ చేసిన యువకుడితో విభేదాలు రావడంతో గత ఏడాది అతడి నుంచి విడిపోయింది. దీనికి ప్రతీకారంగా ఆ యువకుడు ఆమె తల్లిదండ్రులను కాల్చి చంపాడు. శాన్‌జోస్‌లో ఉండే నరేన్ ప్రభు సిలికాన్ వ్యాలీలో టెక్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నాడు. నరేన్ కూతురు, మీర్జా టాట్లిక్ కొంతకాలం పాటు డేటింగ్లో ఉండి అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు. నాటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్న టాట్లిక్ ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రి నరేన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం నరేన్ భార్యను, వారి 13ఏళ్ల కుమారుడిని బందీలుగా చేసుకున్నాడు. నరేన్ పెద్ద కుమారుడు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి టాట్లిక్ ఉన్న గదిని చుట్టుముట్టారు. దీంతో టాట్లిక్ నరేన్ భార్యను కాల్చి చంపి, ఆమె కుమారుడిని వదిలేశాడు. పోలీసులకు లొంగిపోయేందుకు నిరాకరించిన టాట్లిక్‌ను పోలీసులు కాల్చి చంపారు.













