డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురు
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన శరణార్ధులకు ఆశ్రయం కల్పించే నగరాలకు నిధులను నిరాకరిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను శాన్ఫ్రాన్సిస్కో జిల్లా జడ్జి విలియం ఓరిక్ నిలిపివేశారు. గత జనవరిలో జారీ చేసిన అధ్యక్ష ఫరానాలోని కేంద్ర సాయం నిలిపివేత నిబంధనలను జడ్జి దుయ్యబట్టారు. అధ్యక్షుడు ట్రంప్ తన రాజ్యాంగ అధికారాలను అతిక్రమిస్తున్నారని విమర్శించారు. కోర్టు తీర్పుపై మండిపడిన ట్రంప్ సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే నగరాలకు నిధులను నిలిపివేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాన్ని ట్రంప్ ఆదేశించారు. కోర్టుతీర్పు వల్ల ప్రజలకు ఎంతో ఉపశమనం లభించిందని శాన్ఫ్రాన్సిస్కో అటార్నీ డెవిస్ హెరెరా వ్యాఖ్యానించారు.













